ఫిబ్రవరి 27న తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చిన ఛత్తీస్ గఢ్ బాలుడు.. అపహరణకు గురైన కేసులో.. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేశారు. ఛత్తీస్ గఢ్ లోని గరియాబాద్ కు చెందిన బృందంలోని ఆరేళ్ల బాలుడు శివకుమార్ సాహును కిడ్నాప్ చేసిన వ్యక్తిని వెంకట రమణప్పగా గుర్తించారు. కర్ణాటకకు చెందిన అతడిని అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నారు. తిరుపతి అలిపిరి బస్టాండ్ లో బాలుడిని కిడ్నాప్ చేసిన 15 రోజుల తర్వాత విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వద్ద వదిలేసి పారిపోగా.. బాలుడిని పోలీసులు తల్లిదండ్రులకు అప్పగించారు.
ఇదీ చదవండి: అలిపిరిలో అదృశ్యమైన బాలుడిని తిరుపతి పోలీసులకు అప్పగింత
దాదాపు 5 నెలలుగా తప్పించుకు తిరుగుతున్న కర్ణాటకకు చెందిన నిందితుడు వెంకట రమణప్ప అలియాస్ శివప్పను తిరుపతి పోలీసులు అరెస్ట్ చేశారు. లారీ డ్రైవర్ గా పనిచేస్తున్న వెంకటరమణప్పకు హిందీ భాషపై కొంత పట్టు ఉండటంతో అపహరణ చేసినట్లు విచారణలో పోలీసులు గుర్తించారు. తన రెండో కుమారుడు చనిపోవడంతో అదే పోలికలు ఉన్న సాహును అతడు కిడ్నాప్ చేశాడని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి: