అన్యమతస్థులకు సైతం డిక్లరేషన్ లేకుండా తితిదే దర్శనాలకు అనుమతి ఇవ్వడం పలు అనుమానాలకు తావిస్తోందని తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ అన్నారు. రాష్ట్రంలో ఒక వర్గాన్ని ప్రోత్సహించి దాడులకు ప్రేరేపిస్తున్నారని.. ప్రభుత్వం నిర్లక్ష్య ధోరణితో ఉందని ఆయన మండిపడ్డారు.
పాలనను పక్కన పెట్టి న్యాయస్థానాలు, న్యాయమూర్తులకు దురుద్దేశాలు ఆపాదిస్తున్నారని కనకమేడల విమర్శించారు. జడ్జిలను బెదిరించే ప్రయత్నాలు మానుకోవాలని వైకాపా ప్రభుత్వానికి ఆయన సూచించారు. దర్యాప్తునకు ఆదేశిస్తూనే మంత్రులే తీర్పు చెబుతున్నప్పుడు.. కమిటీలు, పోలీసులు దర్యాప్తులు తూతూ మంత్రంగా మారాయని ఆయన ఎద్దేవా చేశారు.
ఇదీ చదవండి: ఎన్ఐఏ తనిఖీలు: అల్‌ఖైదాకు చెందిన 9 మంది అరెస్ట్