ETV Bharat / city

తితిదే ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన జేఈవో - తితిదే ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను త‌నిఖీ చేసిన జెఈవో

తిరుప‌తిలోని తితిదే ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను జేఈవో ఎస్‌.భార్గ‌వి పరిశీలించారు. 721 గృహాలు ఖాళీగా ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

JEO inspecting TTD employee quarters
తితిదే ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను పరిశీలిస్తున్న జేఈవోభార్గవి
author img

By

Published : Oct 7, 2020, 8:27 AM IST

తిరుప‌తిలోని ప‌లు ప్రాంతాల్లో ఉన్న తితిదే ఉద్యోగుల క్వార్ట‌ర్స్‌ను జేఈవో ఎస్‌.భార్గ‌వి త‌నిఖీ చేశారు. కపిలతీర్థం క్వార్టర్స్‌, వినాయ‌క న‌గ‌ర్, రామ్‌నగ‌ర్ ప్రాంతాల్లోని ఉద్యోగుల నివాసాల‌ను ప‌రిశీలించారు. ఈ ప్రాంతాల్లోని 1697 క్వార్ట‌ర్స్‌లో 721 గృహాలు ఖాళీగా ఉన్న‌ట్టు గుర్తించారు. ఖాళీగా ఉన్న నివాసాలను ఇతరులకు కేటాయించడానికి అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను అదేశించారు.

నీటి వ‌స‌తి, విద్యుత్‌, పారిశుద్ధ్యం విష‌యంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాల‌ని సూచించారు. నివాస గృహాల్లో సమస్యలను పరిష్కరించాలని... మ‌రింత మెరుగైన సౌక‌ర్యాలు క‌ల్పించాల‌ని అధికారుల‌ను ఆదేశించారు. జేఈవో వెంట తితిదే ఎస్టేట్ ఆఫీస‌ర్ మ‌ల్లిఖార్జున‌, ఎస్​ఈలు జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, వెంక‌టేశ్వ‌ర్లు, ఈఈ జయరాం నాయక్, అద‌న‌పు ఆరోగ్యశాఖాధికారి డాక్ట‌ర్ సునీల్‌కుమార్ ఉన్నారు.

ఇదీ చదవండి: ఎర్రంరెడ్డిపాలెంలో నిబంధనలు ఉల్లంఘించి... రిజిస్ట్రేషన్లు!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.