తిరుపతి పార్లమెంటు అభ్యర్థి పోటీ విషయంలో స్పష్టత వెలువడేందుకు సమయముందని జనసేన పార్టీ తెలిపింది. పోటీ విషయంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతమని జనసేన పార్టీ తిరుపతి పార్లమెంటరీ కార్యనిర్వాహక కమిటీ పేర్కొంది. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, జనసేన అధినేత పవన్ కల్యాణ్ చర్చల అనంతరమే పోటీ చేసే అభ్యర్థిపై తుది నిర్ణయముంటుందని పేర్కొంది. సంస్థాగతంగా భాజపా కంటే జనసేనే బలంగా ఉందని జనసేన నేతలు వ్యాఖ్యానించారు.
ఇదీ చదవండి: వాటర్ హీటర్ షాక్ కొట్టి.. తల్లి, ఇద్దరు కుమారులు మృతి