తిరుపతి లోక్ సభ నియోజకవర్గ ఉపఎన్నిక జనసేనకు వార్మప్ మ్యాచ్ లాంటిదని.. ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ అన్నారు. తిరుపతిలో జనసేన శాసనసభ నియోజకవర్గ బాధ్యులతో ఆయన ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు.
పవన్ కల్యాణ్ హోమ్ ఐసోలేషన్లో ఉన్న కారణంగా.. నెల్లూరు జిల్లా నాయుడు పేటలో నిర్వహించతలపెట్టిన ప్రచార సభలో ఆయన పాల్గొనే అవకాశం లేదని నాదెండ్ల తెలిపారు. భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకి ఘన స్వాగతం పలకాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం జనసైనికులు శాయశక్తులా కృషి చేయాలని కోరారు.
ఇదీ చదవండి: