తిరుమల శ్రీవారిని హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో కుటుంబ సభ్యులతో కలసి స్వామివారి సేవలో పాల్గొన్నారు. ఆలయం వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రికి.. తితిదే అధికారులు స్వాగతం పలికారు. ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు. మూలమూర్తిని దర్శించుకున్న అనంతరం రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం పలికి శేషవస్త్రంతో సత్కరించారు. స్వామివారి తీర్ధ ప్రసాదాలను అందజేశారు. స్వామివారి దర్శనంపై.. సీఎం ఠాకూర్ ఆనందం వ్యక్తం చేశారు.
అనంతరం తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని, శ్రీకాళహస్తీశ్వరాలయాన్ని సందర్శించారు. ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించిన జైరామ్ ఠాకూర్‌కు అధికారులు, అర్చకులు తీర్థప్రసాదాలు, జ్ఞాపికలు అందజేశారు.
ఇదీ చదవండి :మన్యంలో మృత్యుఘోష.. అసోదాలో ఆదివాసీల క'న్నీటి' వ్యథ