ETV Bharat / city

RAINS IN ANDHRA PRADESH : భారీ వర్షాలు... లోతట్టు ప్రాంతాలు జలమయం - andhrapradhesh latest news

రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తోంది. తెల్లవారు జామున కురిసిన వర్షానికి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. లోతట్టు ప్రాంతాల్లో నీరు నిలిచింది. రహదారులపై వరద నీరు ప్రవహిస్తుండటంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు.

ఎడతెరిపి లేకుండా వర్షాలు
ఎడతెరిపి లేకుండా వర్షాలు
author img

By

Published : Nov 1, 2021, 11:05 AM IST

Updated : Nov 1, 2021, 11:40 AM IST

రాష్ట్రంలోని చిత్తూరు, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సోమవారం తెల్లవారు జాము నుంచి భారీ వర్షం కురుస్తోంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి.

తిరుపతిలో..

తిరుపతి నగరంలో ఉదయం కురిసిన కుండపోత వర్షంతో నగర వీధులన్నీ జలమయం అయ్యాయి. మధురా నగర్, లక్షీపురం కూడలి, లీలామహల్ కూడలి, ఏఐఆర్ బైపాస్ రోడ్డు, అన్నపూర్ణ గుడి తదితర ప్రాంతాల్లో నివాస ప్రాంతాల్లో వరద నీరు చేరింది.

కడపలో...

కడపలో తెల్లవారుజాము నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు నగరంలోని పలు కాలనీలు నీటమునిగాయి. పలు నివాసాల్లోకి మోకాలు లోతు వర్షపు నీరు చేరడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు.

ప్రకాశం జిల్లాలో..

ప్రకాశం జిల్లావ్యాప్తంగా పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. కందుకూరు, వలేటివాటిపాలెం, టంగుటూరు, సింగరాయకొండ మండలాల్లో ఎడతెరపి లేని వర్షం పడుతోంది. వర్షం కారణంగా విద్యుత్‌ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.

నెల్లూరు జిల్లాలో..

నెల్లూరు జిల్లాలో ఉదయం నుంచి పలుచోట్ల వర్షం కురిసింది. ఫలితంగా లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.

ఇదీచదవండి.

FORMATION DAY WISHES : 'ఏపీ దేశానికి ఆదర్శంగా నిలిచింది'

Last Updated : Nov 1, 2021, 11:40 AM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.