తిరుమల పుణ్యక్షేత్రం.. నిత్యం గోవింద నామ స్మరణలతో మారుమోగుతూనే ఉంటుంది. కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. ఆ గోవిందుడికి తమకు తోచినంతలో కానుకలు సమర్పించుకుంటారు. ఈ క్రమంలోనే తమిళనాడుకు చెందిన తంగదొరై అనే భక్తుడు.. శ్రీవారికి బంగారు శంఖు చక్రాలు సమర్పించుకున్నారు. 3.50 కిలోల బంగారంతో చేసిన ఈ ఆభరణాలను ఆలయ ఈవో ధర్మారెడ్డికి అందించారు.
ఇదీ చదవండి: దుర్గగుడిలో అక్రమార్కులపై వేటు.. 15మంది ఉద్యోగుల సస్పెన్షన్