తిరుపతి ఉపఎన్నికలో లబ్ధి పొందడానికి భగవంతుడిని రాజకీయంగా వాడుకుంటున్నారని... తిరుపతి ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించిన ఆయన... జనసేన అధినేత పవన్‌కల్యాణ్ తిరుపతి పర్యటనలో చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. వైకాపా మీద మతదాడి చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు.
దేవుడి విశ్వాసాలున్న వారు ఇలాంటి వ్యాఖ్యలు చేయరన్నారు. హైదరాబాద్‌లో మతవిద్వేషాలను లబ్ధి కోసం భాజపా వాడుకుందన్న ఆయన... అలాంటి తరహా ఎత్తుగడనే తిరుపతి ఉపఎన్నికల్లో పాటిస్తున్నారని ఆరోపించారు. 2014లో ప్రత్యేక హోదా కోరిన వ్యక్తి... ప్యాకేజ్‌ను పాచిపోయిన లడ్డూలన్న వ్యక్తి... ఇప్పుడు భాజపాతో కలిసి.. వైకాపాపై విమర్శలు చేయటాన్ని గమనిస్తున్నారని పేర్కొన్నారు.
ఇదీ చదవండి: