తిరుపతి హోటళ్లపై కొంతకాలంగా ఫిర్యాదులు ఎక్కువ కావడం వల్ల మంగళవారం ఆహార భద్రతా, విజిలెల్స్ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. రైల్వేస్టేషన్ ఎదురుగా ఉన్న హోటల్లో తనిఖీలు చేయగా ఎక్కువగా కల్తీ ఆహారాన్ని ప్రయాణికులకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. రెండు, మూడు రోజుల పాటు నిల్వ ఉన్న ఆహారాన్ని ప్రయాణికులకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. నిషేధిత రసాయనాలు వాడడమే కాకుండా నాణ్యతలేని సరుకులు, కూరగాయలు వినియోగించి తయారుచేసి యాత్రికులకు, ప్రయాణికులకు అంటగడుతున్నారు. తినడానికి ఏ మాత్రం ఉపయోగపడని ఆహార పదార్థాలను స్వాధీనం చేసుకొని వాటిని ధ్వంసం చేశారు. ఆహార పదార్థాల నమానాలను సేకరించి యజమానిపై కేసు నమోదు చేశారు. వీటితో పాటుగా గుట్కాలు స్వాధీనం చేసుకున్నారు. తిరుపతిలో ఇక నిరంతరం దాడులు నిర్వహించి కల్తీ ఆహారాన్ని విక్రయించకుండా అడ్డుకుంటామని ఆహార భద్రతా అధికారులు తెలిపారు.
ఇదీ చదవండి :