అధికార పార్టీ నాయకులు.. తమ కుటుంబంపై రాజకీయ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతున్నారని తిరుపతి మాజీ శాసన సభ్యురాలు సుగుణమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుపతి మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేసిన తన మనవరాలు కీర్తిపై అక్రమ కేసులు పెట్టి అరెస్ట్ చేయాలని చూస్తున్నారని ఆరోపించారు. తిరుపతి నియోజకవర్గ తెదేపా సమన్వయ కమిటీ సమావేశంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా నగరంలో చోటు చేసుకుంటున్న పరిస్ధితులపై తీవ్రస్థాయిలో విమర్శించారు.
ప్రజాస్వామ్యహితంగా గెలవలేమని భావించే మున్సిపల్ ఎన్నికల్లో వైకాపా నేతలు అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. తన రాజకీయ వారసురాలు కీర్తి అని ఆమెపై తిరుపతి ఎమ్మెల్యే కరుణాకరరెడ్డి అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని పేర్కొన్నారు. అభం శుభం తెలియని తమ మనవరాలిపై పోలీసు కేసులు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని కంటతడిపెట్టారు. దౌర్జన్యంగా మాపై కేసులు పెట్టినంత మాత్రాన తమను అడ్డుకోలేరని హెచ్చరించారు.
ఇదీ చదవండి:
కక్షసాధింపులో భాగంగానే చంద్రబాబుకు సీఐడీ నోటీసులు: అచ్చెన్నాయుడు