ELEPHANTS: తిరుపతి జిల్లా రేణిగుంట మండలంలోని రామకృష్ణాపురం గ్రామంలో ఏనుగులు కలకలం సృష్టించాయి. ఈ తెల్లవారుజామున మూడున్నర గంటల సమయంలో 3 ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించాయి. గ్రామంలోని ఓ ఇంటి వద్ద ఉన్నసీసీ కెమెరాల్లో ఏనుగులు సంచరిస్తున్న దృశ్యాలు రికార్డయ్యాయి. గ్రామ సమీపంలో అటవీ ప్రాంతం లేకపోయినా ఏనుగులు గ్రామంలోకి ప్రవేశించడంపై ఆందోళన నెలకొంది. తెల్లవారేసరికి ఏనుగులు రామకృష్ణాపురం పొరుగున ఉన్న ఎర్రంరెడ్డిపాలెం గ్రామ సమీపానికి వెళ్లాయి. ఎర్రంరెడ్డిపాలెం పక్కనే ఉన్న ముళ్ళపొదల్లో ఏనుగులు సంచరిస్తున్నాయి.
ఇదీ చదవండి: విశాఖలో వ్యర్థాల నుంచి విలువైన వస్తువుల తయారీ ప్రాజెక్టు
ELEPHANTS: రామకృష్ణాపురంలో ఏనుగుల సంచారం... భయాందోళనలో గ్రామస్థులు - తిరుపతి లేటెస్ట్ అప్డేట్స్
ELEPHANTS: చిత్తూరు జిల్లావాసులను ఏనుగులు భయాందోళనకు గురి చేస్తున్నాయి. జిల్లాలో ఏదో ఒక ప్రాంతంలో అవి గ్రామాల్లోకి వస్తున్నాయి. తాజాగా రేణిగుంట మండలం రామకృష్ణాపురంలో ఏనుగుల సంచరించాయి. గ్రామంలోని సీసీ కెమెరాల్లో రికార్డ్ అయిన ఏనుగుల దృశ్యాలు గ్రామస్థులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి.