తిరుమల అన్నమయ్య భవన్‌లో డయల్ యువర్ ఈవో కార్యక్రమం జరిగింది. భక్తుల ప్రశ్నలకు తితిదే ఈవో జవహర్ రెడ్డి సమాధానాలిచ్చారు. కొవిడ్ వల్ల ఆర్జితసేవల టికెట్లు రద్దైన వారికి డిసెంబర్ వరకు వీఐపీ బ్రేక్ దర్శనం కల్పిస్తామని ఈవో అన్నారు. కొవిడ్ మార్గదర్శకాలు వచ్చాకే వృద్ధులు, పిల్లలకు దర్శన అవకాశం ఇస్తామన్నారు.
శివ కేశవుల అబేధం వివరించేందుకే శ్రీవారి ఆలయంలో కార్తీక దీపోత్సవం నిర్వహిస్తున్నామన్నారు. నాద నీరాజన వేదికపై గీతా పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచనాలను కొనసాగించేలా ప్రణాళికలు రచిస్తున్నట్లు ఈవో తెలిపారు. సర్వదర్శనం టికెట్లు... ఆన్‌లైన్, ఈ-దర్శన్ కౌంటర్లలో జారీకి సమయం పడుతుందన్నారు. తిరుమలలో 200 మందిలోపు ఆహ్వానితులతో వివాహాలకు అనుమతినిస్తున్నట్లు తితిదే ఈవో పేర్కొన్నారు.
ఇదీ చదవండి: