తితిదే సర్వర్ పని చేయకపోవడంతో.. గంటల తరబడి తిరుమలలో భక్తులు అవస్థలు పడుతున్నారు. శనివారం మధ్యాహ్నం సర్వర్లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. గదుల కేటాయింపు, టిక్కెట్ల పరిశీలన, డోనార్ సెల్, జేఈవో కార్యాలయంలోని అన్ని కార్యకలాపాలకు అంతరాయం ఏర్పడింది. కొన్ని గంటలుగా యాత్రికులు గదుల కోసం క్యూ లైన్లలో నిలబడి వేచి చూస్తూ.. నిర్వహణపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సమస్యను త్వరగా పరిష్కరించాలని కోరుతున్నారు. తితిదే వంటి ఉన్నత సంస్థలో సమస్యలు తలెత్తినపుడు.. సత్వరం పరిష్కరించే వ్యవస్థ లేకపోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఇదీ చదవండి: