తిరుమల శ్రీవారి ఆన్‌లైన్ ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు ఉన్న వారిని మాత్రమే.. అధికారులు కొండపైకి అనుమతిస్తున్నారు. ఇప్పటికే ఆన్‌లైన్ ద్వారా ఈ నెలాఖరు వరకు సంబంధించిన టికెట్లను విక్రయించారు. అలిపిరి తనిఖీ కేంద్రంలో టిక్కెట్లను పరిశీలించిన తర్వాతే.. భక్తులను అనుమతిస్తున్నారు.
కొందరు భక్తులు టికెట్లు లేకుండా అలిపిరికి చేరుకుని భద్రతా సిబ్బంతో వాగ్వాదానికి దిగుతున్నారు. కొవిడ్ నిబంధనల మేరకు పరిమిత సంఖ్యలో దర్శన టికెట్లను జారీ చేసి భక్తులకు దర్శనం కల్పిస్తున్నామని అధికారులు వారికి వివరిస్తున్నారు. పెరటాసి మాసం తొలి శనివారం సందర్భంగా.. తమిళులు ఎక్కువగా వచ్చే అవకాశం ఉండడంపై.. అధికారులు భక్తులను కొండపైకి అనుమతించే విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారు.
ఇదీ చదవండి: