ETV Bharat / city

కృష్ణా జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారు: దేవినేని ఉమా - సీఎం జగన్​పై దేవినేని ఉమా విమర్శలు

మొన్నటి ఎన్నికల కోసం డబ్బు తీసుకున్నందుకే... కృష్ణా జలాలను తెలంగాణకు తాకట్టు పెట్టేశారని మాజీ మంత్రి దేవినేని ఉమా ఆరోపించారు. ఈ ప్రభుత్వ నిర్వాకంతో సీమాంధ్ర రైతాంగానికి ఉరితాడు పడిందని విమర్శించారు.

devineni uma allegations on cm jagan, uma fired about krishna river water share
సీఎం జగన్​పై దేవినేని ఉమా ఆగ్రహం, కృష్ణా జలాలపై దేవినేని ఉమా వ్యాఖ్యలు
author img

By

Published : Apr 12, 2021, 10:39 AM IST

ఈ అసమర్థ ప్రభుత్వం కృష్ణా జలాలను తాకట్టు పెట్టేసిందని.. దాన్నో ఘనకార్యంలా వాళ్ల పత్రిక మొదటిపేజీలో రాసుకున్నారని తెదేపా సీనియర్‌ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శించారు. తిరుపతిలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ... విభజన చట్టం పరిధిలో లేని ప్రాజెక్టులనూ కృష్ణా బోర్డు పరిధిలోకి తీసుకువెళ్లేందుకు ప్రభుత్వం అంగీకరించడం దారుణమన్నారు. పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి దగ్గర మొన్నటి ఎన్నికల కోసం డబ్బు తెచ్చుకున్నారని, అందుకోసం మన హక్కు అయిన కృష్ణా జలాలను సీఎం జగన్‌ తెలంగాణకు తాకట్టు పెట్టేశారని ఆరోపించారు. రాయలసీమ హక్కులను, సాగర్‌ జలాలనూ తాకట్టు పెట్టి బోర్డు నియంత్రణ పరిధిలోకి ఈ ప్రాజెక్టులు తీసుకువచ్చారని ఆగ్రహించారు.

‘ఇక బోర్డు పరిధిలోనే నీటి విడుదల జరగబోతోంది. రాబోయే రోజుల్లో హంద్రీనీవా, గాలేరు నగరి, తెలుగుగంగ, వెలిగొండ, పోతిరెడ్డిపాడు, నాగార్జునసాగర్‌ ఆయకట్టు కింద నీళ్లు ప్రశ్నార్థకం కాబోతున్నాయి. గత 23 నెలలుగా దిల్లీలో జరుగుతున్న కుట్ర, కుతంత్రాలకు ఇది అద్దం పడుతోంది. విభజన చట్టంలో ఏ ప్రాజెక్టులు పెట్టేందుకు మనం అంగీకరించలేదో అవన్నీ బోర్డు పరిధిలోకి తీసుకువచ్చేశారు. ఈ నిర్ణయం వల్ల సీమాంధ్ర రైతాంగానికి ఉరితాడు పడింది’ అని దేవినేని ఉమ వాపోయారు.

రైతులంతా మేలుకొని గట్టి పోరాటం చేయకపోతే నష్టపోతామని మాజీ మంత్రి హెచ్చరించారు. కేసుల నుంచి బయటపడేందుకు, పక్క రాష్ట్రంలో తన ప్రయోజనాలు కాపాడుకోవడానికి మన హక్కుల్ని, మన నీటిని జగన్‌ తాకట్టు పెట్టారన్నారు. దీని వల్ల 200 నుంచి 300 టీఎంసీల నీళ్లు తెలంగాణకు వదులుకోవాల్సి వస్తుందని చెప్పారు. ప్రస్తుతం బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌-2లో వాదోపవాదాలు సాగుతున్నాయని, మన వాదనలన్నీ వీగిపోయే ప్రమాదం ఉందని ఆందోళన చెందారు. ఈ ప్రభుత్వం చేసిన తెలివి తక్కువ పనికి తెలంగాణ.. ప్రాజెక్టుల వారీగా కేటాయింపులు తెచ్చుకుంటోందని, చరిత్రలో దీన్నో బ్లాక్‌డేగా చెప్పవచ్చని అన్నారు. తాడేపల్లి రాజప్రసాదంలో ఉన్న జగన్‌ బయటకు వచ్చి... కృష్ణా జలాల్ని ఎందుకు తాకట్టు పెట్టారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

అక్రమాలను ప్రశ్నిస్తే తప్పుడు కేసులు...

రాష్ట్రంలో ప్రభుత్వ అక్రమాలను ప్రశ్నించే వారిని అణిచివేసేందుకు తప్పుడు కేసులు పెడుతున్నారని ఉమా ఆరోపించారు. ‘ఈ నెల 7న తిరుపతిలో విలేకరులతో మాట్లాడిన నాపై కక్షపూరితంగా సీఐడీ కేసు నమోదు చేసింది. తిరుపతిలో ఉండటానికి ఎవరు ఇష్టపడతారని.. జగన్‌ చేసిన వ్యాఖ్యలను మీడియా దృష్టికి తీసుకొస్తే తప్పుడు కేసులు పెట్టారు. కేసులకు భయపడేది లేదు. నాపై కాదు కేసు పెట్టాల్సింది.. వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు గురైతే గుండెపోటుతో మృతి చెందినట్లు రాసిన వాళ్ల పత్రికపై సీఐడీ కేసు నమోదు చేయాలి’ అని పేర్కొన్నారు. ఈ సమావేశంలో పార్టీ నేతలు పట్టాభిరాం, పిల్లి మాణిక్యరావు, వంతల రాజేశ్వరి, సుగుణమ్మ, నరసింహయాదవ్‌ పాల్గొన్నారు.

ఇదీ చదవండి:

ఉత్తమ వాలంటీర్లకు అవార్డులు..ఇవాళ ప్రారంభించనున్న సీఎం

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.