తిరుమల కనుమ దారుల్లో నిత్యం వన్యప్రాణులు ప్రమాదాలకు గురవుతున్నాయి. మొదటి కనుమ దారిలో ఏడో మైలు వద్ద జింకలు, దుప్పిలు రహదారికి సమీపంలోకి వచ్చి సంచరిస్తుంటాయి. జంతుప్రేమికులు వాటితో సరదాగా గడుపుతూ ఫోటోలు దిగుతున్నారు. ఇలా అవి రహదారి పక్కన తిరిగే సమయంలో ఒక్కోసారి వేగంగా ప్రయాణిస్తున్న వాహనాలకు అడ్డుగా వచ్చి దెబ్బలు తగలడం గానీ, చనిపోవటం గానీ జరుగుతున్నాయి. ఇటీవల ఓ జింక ప్రమాదానికి గురై ప్రాణాపాయ స్థితికి చేరుకుంది. గమనించిన భక్తులు ఆ జింకను బ్రతికించేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అలిపిరి నడకమార్గంలో ఏడో మైలు వద్ద జింకల పార్కులో ఉన్న వీటిని...కొన్ని రోజులుగా అటవీ ప్రాంతంలో వదిలిపెడుతున్నారు. అవి భక్తులు పెట్టే చిరుతిండికి అలవాటుపడి రహదారిపైకి వచ్చి ప్రాణాలు వీడుతున్నాయి.
ఇవీ చదవండి...రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారికి అశ్రు నయనాల మధ్య అంత్యక్రియలు