రెండు రోజుల పర్యటన నిమిత్తం తిరుపతికి చేరుకున్న ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదిత్యనాథ్ దాస్‌కు (CS adityanath das) చిత్తూరు జిల్లా అధికారులు రేణిగుంట విమానాశ్రయంలో ఘన స్వాగతం పలికారు. అనంతరం తిరుచానూరు, కాణిపాకం ఆలయాలను సీఎస్ కుటుంబ సభ్యులు సందర్శించారు. మొదటగా తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు అమ్మవారి తీర్థప్రసాదాలు అందజేశారు.
అనతరం కాణిపాకం చేరుకున్న ఆయనకు అధికారులు సాంప్రదాయబద్ధంగా స్వాగతం పలికారు. స్వామివారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారులు సీఎస్‌కు తీర్థప్రసాదాలు, స్వామి వారి చిత్రపటాన్ని అందజేశారు. దర్శనం తర్వాత కాణిపాకం నుంచి తిరుమలకు బయలుదేరి వెళ్లారు.
ఇదీచదవండి