ETV Bharat / city

ఆనందయ్య మందుకు అనుమతిని స్వాగతించిన సీపీఐ నారాయణ

ప్రజల అభీష్టం మేరకు రాష్ట్ర ప్రభుత్వం, కోర్టు.. ఆనందయ్య కరోనా మందుకు గ్రీన్​ సిగ్నల్ ఇవ్వడంపై సీపీఐ నారాయణ హర్షం వ్యక్తం చేశారు. ఈ నిర్ణయాన్ని తమ పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్లు చిత్తూరు జిల్లా ఐనవరంలో చెప్పారు.

cpi narayana on anandayya medicine
ఆనందయ్య మందు అనుమతిని స్వాగతించిన సీపీఐ నారాయణ
author img

By

Published : Jun 1, 2021, 5:49 AM IST

ప్రజల నుంచి వచ్చిన ఒత్తిడితోనే రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి ఆనందయ్య ఔషధం పంపిణీకి అనుమతులు ఇచ్చిందని సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ అన్నారు. చిత్తూరు జిల్లా నగరి మండలం ఐనంబాకంలో ఆయన మాట్లాడారు. ఆనందయ్య ఔషధంపై హైకోర్టు గ్రీన్ సిగ్నల్, రాష్ట్ర ప్రభుత్వ అనుమతులను తమ పార్టీ తరఫున స్వాగతిస్తున్నట్లు తెలిపారు.

ఆనందయ్య కేవలం కోవిడ్ రోగులకే వైద్యం చేయట్లేదన్న నారాయణ.. గత 30 ఏళ్లుగా పరిసర ప్రాంత ప్రజలకు అనేక సమస్యలకు వైద్యసేవలు అందిస్తున్నారని చెప్పారు. కరోనా మందు అంటూ ఆనందయ్యను మానసికంగా క్షోభ పెట్టారని ఆరోపించారు. ఆనందయ్య ఆయన కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురిచేశారని అసంతృప్తి వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

Covid: 2 నెలల్లో 17వేల మంది పిల్లలకు వైరస్​!

తిరుమలలో పెరిగిన అటవీ జంతువుల సంచారం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.