ETV Bharat / city

కొవిడ్ బారిన తితిదే ఉద్యోగులు...అప్రమత్తమైన అధికారులు - తితిదే వార్తలు

తిరుమలలో కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య పెరుగుతుండటం తితిదే అధికారులను ఆందోళనకు గురి చేస్తోంది. లాక్‌డౌన్‌ సడలింపుల నేపథ్యంలో.. 3 నెలల విరామం అనంతరం సామాన్య భక్తులను శ్రీవారి దర్శనానికి అనుమతిస్తున్నారు. భక్తులకు సేవలు అందించే తితిదే ఉద్యోగులు కరోనా బాధితులుగా మారుతుండటం... శ్రీవారి దర్శనాలపై ప్రభావం చూపుతోంది. దర్శనానికి వచ్చే భక్తుల నుంచి నమూనాలు సేకరించిన తరహాలోనే... ఉద్యోగుల నుంచి విస్తృత సంఖ్యలో నమూనాలు సేకరించాలని అధికారులు నిర్ణయించారు.

covid Positive Cases rises in tirumala
తిరుమల తిరుపతి దేవస్థానం
author img

By

Published : Jul 6, 2020, 4:08 PM IST

తిరుమల తిరుపతి దేవస్థానం

రోజుకు దాదాపు 13వేల మంది భక్తులు తిరుమల శ్రీవారిని దర్శించుకుంటున్నారు. భక్తులకు అలిపిరి సమీపంలోనే పూర్తిస్థాయిలో పరీక్షలు నిర్వహించిన తర్వాతనే తిరుమలకు అనుమతిస్తున్నారు. తిరుమలలో కరోనా పాజిటివ్‌ వచ్చిన వారిలో భద్రతా సిబ్బంది, మంగళ వాద్యాల కళాకారులు ఉండటంతో తితిదే అప్రమత్తమైంది. గడచిన వారం రోజుల్లో తిరుమలలో విధులు నిర్వహిస్తున్న17 మంది కరోనా బారిన పడ్డారు.

భక్తుల ద్వారా తితిదే సిబ్బందికి కరోనా వైరస్‌ సంక్రమించలేదని గుర్తించిన తితిదే... ఉద్యోగుల నుంచి నమూనాలను విస్తృత స్థాయిలో సేకరించాలని నిర్ణయించారు. రోజుకు వంద మంది నుంచి కరోనా పరీక్షల కోసం స్వాబ్స్‌ సేకరించేందుకు చర్యలు చేపట్టినట్లు అధికారులు తెలిపారు.

తితిదే అధికారుల సూచనల మేరకు సిబ్బంది నమూనాలు సేకరిస్తున్నామని... ఫలితాలు త్వరితగతిన వచ్చేలా చర్యలు చేపట్టామని జిల్లా అధికారులు తెలిపారు.

ఇవీ చదవండి: తితిదే అధికారుల నిర్లక్ష్యం... శ్రీవారి ఆలయ గోపురాలపై మెుక్కలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.