తిరుపతి లోక్ సభ ఎన్నికల సర్వేలకు విశ్వసననీయత లేదని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత చింతా మోహన్ అన్నారు. తిరుపతిలో జరిగిన మీడియా సమావేశంలో అయన మాట్లాడారు. ముఖ్యమంత్రి చేసిన పొరపాట్లు కప్పి పుచ్చుకునేందుకు తప్పుడు సర్వేలు చేయిస్తున్నారని మండిపడ్డారు. నగరంలో ఏ ప్రాంతంలో సర్వే చేశారో జగన్ తెలపాలన్నారు. 3.5 లక్షల దొంగ ఓట్లు పోలయ్యాయని .. అవి ఏ పార్టీకి కలిపారని అన్నారు. కరోనా కట్టడి చేయడంలో, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడంలో భాజపా ప్రభుత్వం విఫలమైందన్నారు.
ఇదీ చదవండి: 'అమరావతి అభివృద్ధిలో కేంద్రానికి బాధ్యత ఉంది'