మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డితో పాటు కుప్పం తెదేపా నేతలు తమ సోదరుడు ప్రకాశ్, అతని కుటుంబాన్ని కిడ్నాప్ చేశారంటూ గోవిందరాజు అనే వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తెలుగుదేశం నాయకులు వాహనంలో వచ్చి తన సోదరుడు, అతని భార్య, ఇద్దరు కుమారులకు తీసుకెళ్లారని కుప్పం పట్టణ పరిధిలోని దలవాయి కొత్తూరుకు చెందిన గోవిందరాజు ఫిర్యాదులో పేర్కొన్నారు. కుప్పం పురపాలక ఎన్నికల్లో తెదేపా అభ్యర్థిగా 14 వార్డు నుంచి ప్రకాశ్ పోటీ చేస్తున్నారు. కుప్పం ఎన్నికల్లో వైకాపా నేతలు బెదిరింపు రాజకీయాలకు పాల్పడుతూ... తప్పుడు కేసులు పెడుతున్నారని మాజీ మంత్రి అమరనాథ్‌రెడ్డి ఆరోపించారు. తమ పార్టీకి చెందిన అభ్యర్థిని అపహరించాల్సిన అవసరం తమకేంటని ప్రశ్నించారు.
ప్రకాశ్ అదృశ్యంపై అచ్చెన్న స్పందన...
కుప్పంలో ప్రకాశ్‌తో పాటు నామినేషన్ వేసిన తెదేపా అభ్యర్ధి వెంకటేష్ పై వైకాపా నేతలు దాడి చేయడాన్ని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. ప్రకాశ్ పై వైకాపా నేతలు దాడి చేసేందుకు కుట్ర పన్నారన్న అచ్చెన్న...ప్రాణ రక్షణ కోసం, తన నామినేషన్ కాపాడుకునేందుకు అజ్ఞాతంలోకి వెళ్లారని చెప్పారు. ప్రకాశ్ ను ఎవరూ కిడ్నాప్ చేయలేదని, వైకాపా నేతలు అవాస్తవాలను ప్రచారం చేస్తున్నారని ఆక్షేపించారు.
ఇదీచదవండి.