జగన్ పాలనలో రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ ఆరోపించారు. రాజ్యాంగ వ్యవస్థలతో ముఖ్యమంత్రి జగన్ యుద్ధం చేస్తున్నారని.... ఇది మంచి పరిణామం కాదని హితవు పలికారు. తిరుపతిలోని తన నివాసం వద్ద మీడియాతో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఖజానాను ఖాళీ చేయడం తప్ప వైకాపా నేతలు చేస్తున్నదేమీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో అధికారులు అయోమయంలో ఉన్నారని చింతా మోహన్ అన్నారు. పాలనలో అనుభవం లేకపోవటంతో ఈ సమస్యలు వస్తున్నాయని అభిప్రాయపడ్డారు. భాజపా, తెదేపా, వైకాపా వల్ల రాష్ట్రానికి ఎలాంటి ప్రయోజనం లేదని అభిప్రాయపడ్డారు.
ఇదీ చదవండి