తిరుపతి పార్లమెంట్ పరిధిలో సంస్థాగతంగా తెదేపాను బలోపేతం చేయాలని ఆ పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పిలుపునిచ్చారు. నూతనంగా నియమించిన పార్లమెంట్ తెదేపా అధ్యక్షులతో మంగళవారం ఆయన జూమ్ యాప్ ద్వారా సమావేశమయ్యారు. ఇందులో భాగంగా తిరుపతి పార్లమెంట్ అధ్యక్షుడు జి.నరసింహయాదవ్‌తో ఆయన మాట్లాడారు.
పార్లమెంట్ పరిధిలో నాయకులు, కార్యకర్తలను సమన్వయం చేసుకుని పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని చెప్పారు. గ్రామస్థాయి నుంచి పార్టీ కమిటీలను ఏర్పాటు చేసి మంచి నాయకత్వాన్ని తయారు చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు ప్రశ్నించాలని తెలిపారు. తిరుపతిలో తెదేపా హయంలో తలపెట్టిన అనేక అభివృద్ధి పనులు మధ్యలోనే ఆగిపోయినట్లు నరసింహయాదవ్ తెలిపారు. బీసీ, కాపు భవన నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయినట్లు చంద్రబాబు దృష్టికి తీసుకొచ్చారు.
ఇదీ చదవండి: పులిచింతలకు వరద ఉద్ధృతి..6 గేట్లు ఎత్తి నీరు విడుదల