నకిలీ సిఫార్సు లేఖపై తిరుమల శ్రీవారి వీఐపీ దర్శన టికెట్లను పొంది.. అధిక ధరలకు విక్రయించిన దళారీపై పోలీసులు కేసు నమోదు చేశారు. హైదరాబాద్‌కు చెందిన దినేష్ అనే భక్తుడు.. తిరుపతిలోని దళారి రాఘవను సంప్రదించాడు. నలుగురికి వీఐపీ దర్శనం కల్పించేందుకు.. తెలంగాణ రాష్ట్రం అదిలాబాద్ ఎంపీ సోయం బాబురావు సిఫారసు లేఖను జేఈవో కార్యాలయంలో సమర్పించారు. అదే రోజు మరో లేఖ రాగా.. అనుమానం వచ్చిన తితిదే విజిలెన్స్ అధికారులు ఎంపీ పీఏను సంప్రదించారు.
ఎంపీ ఒకే లేఖ ఇచ్చినట్లు నిర్ధరించుకున్న సిబ్బంది.. సంబంధిత భక్తులను విచారించారు. దళారి రాఘవేంద్ర నుంచి నాలుగు టికెట్లను.. రూ. 11 వేలు చెల్లించి తీసుకున్నట్లు వారు తెలిపారు. భక్తుల ద్వారా తిరుమల రెండవ పట్టణ పోలీసు స్టేషన్లో అధికారులు ఫిర్యాదు చేయించారు. భక్తులను మోసగించడంతో పాటు సిఫార్సు లేఖను దళారీ ఫోర్జరీ చేసినట్లు గుర్తించిన పోలీసులు.. నిర్ధరణ కోసం లేఖను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపించి విచారణ జరుపుతున్నారు.
ఇదీ చదవండి: