తిరుపతి లోక్సభ ఉపఎన్నికలో అధికార, ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. లోక్సభ నియోజకవర్గ పరిధిలో నెల్లూరు జిల్లాలో నాలుగు, చిత్తూరు జిల్లాలో మూడు శాసనసభ నియోజకవర్గాలు ఉండగా.. అన్ని ప్రాంతాల్లో అధికార ప్రతిపక్షాలు జోరుగా ప్రచారం చేస్తున్నాయి. తెదేపా అభ్యర్ధి పనబాక లక్ష్మి.. గూడూరు, వెంకటగిరి నియోజకవర్గాల్లో ప్రచారం చేశారు. గ్రామాల్లో ర్యాలీగా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద ఉన్న రైతులను పలకరించారు. ఉప ఎన్నికల్లో తెదేపాను గెలిపించాలని.. ప్రజా సమస్యలపై లోక్సభలో పోరాటం చేస్తానని హామీ ఇస్తున్నారు.
శ్రీకాళహస్తిలో గురుమూర్తి...
చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో వైకాపా అభ్యర్థి గురుమూర్తి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు వివరిస్తూ ఓట్లను అభ్యర్థించారు. గురుమూర్తిని గెలిపించాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కన్నబాబు.. ఓటర్లను కోరారు. ఎమ్మెల్యేలు బియ్యపు మధుసూదన్ రెడ్డి, ద్వారకనాథరెడ్డి ప్రచారంలో పాల్గొన్నారు.
ఇదీ చూడండి:
విశాఖ ఉక్కుపై హైకోర్టులో ఐపీఎస్ విశ్రాంత అధికారి లక్ష్మీనారాయణ పిల్