తిరుపతి మున్సిపల్ పార్కు సమీపంలోని నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలింది. ఈ ఘటనలో శిథిలాల కింద చిక్కుకుని ఒకరు మృతి చెందగా.. నలుగురు కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. ఈ భవనం తిరుపతి నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో చేపడుతున్నారు.
దాదాపు 30 మంది కూలీలు ఈ భవన నిర్మాణంలో పని చేస్తుండగా ప్రమాదం జరిగింది. రెండవ అంతస్తు పైకప్పు వేస్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. పైకప్పుకు అవసరమైన కాంక్రీట్ వేస్తున్న సమయంలో భవనానికి ఎడమ వైపున ఏర్పాటు చేసిన కర్రలు పడిపోయాయి. ప్రమాదాన్ని గుర్తించిన కార్మికులు బయటకు పరుగులు తీయడంతో పెను ప్రమాదం తప్పింది. పై భాగాన సిమెంట్, కంకర వేస్తున్న ఐదుగురు కార్మికులు కూలిపోయిన భవనంతో పాటు కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డారు. ఘటనాస్థలానికి ఎస్పీ చేరుకుని సహాయచర్యలు పర్యవేక్షించారు.
ఇదీ చదవండి.. అక్కడ నెల నీటి ఖర్చు... అక్షరాల రూ.20 వేలు!