తిరుపతి లోక్సభ నియోజకవర్గ ఉపఎన్నిక జరుగుతున్న సమయంలో.. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా నిర్వహిస్తోందని జీవీఎల్ ప్రశ్నించారు. కోర్టు తీర్పును తాము గౌరవిస్తామన్న జీవీఎల్.. కేంద్ర ఎన్నికల సంఘాన్ని నిర్వీర్యం చేయాలనే ప్రయత్నాలను మాత్రం సహించబోమన్నారు.
గురువారం పరిషత్ ఎన్నికలు జరుగుతున్నా.. భాజపా తిరుపతి ఉపఎన్నిక ప్రచారం నిర్వహిస్తుందని తెలిపారు. కోడ్ ఉల్లంఘన కింద పోలీసులు అరెస్ట్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చునని సవాల్ చేశారు. ఎస్ఈసీ నీలం సాహ్ని.. రాజ్యంగ స్ఫూర్తితో వ్యహరించాలని కోరుతున్నామన్నారు. రేషన్ పంపిణీ వాహనాలను సైతం వైకాపా నాయకులు ప్రచారానికి వాడుకుంటున్నారని ఆరోపించిన జీవీఎల్.. సీఎం జగన్ తిరుపతి పర్యటన.. వైకాపా భయానికి నిదర్శనమని అన్నారు.
ఇదీ చదవండి: