తితిదే ఆస్తుల విక్రయానికి వీల్లేకుండా పాలకమండలిలో తీర్మానం చేయాలని భాజపా నేత, తితిదే బోర్డు మాజీ సభ్యుడు భానుప్రకాశ్‌రెడ్డి డిమాండ్ చేశారు. రూ. 10 కోట్లు ఇచ్చిన వారికి తిరుమలలో స్థలం ఇవ్వాలనే తీర్మానం ఉందని గుర్తు చేశారు. తిరుమలలో 14 వసతి గృహాల కాలపరిమితి తీరిపోనుందన్న ఆయన... వాటిని ఇతరులకు కట్టబెడుతున్నారనే అనుమానం వ్యక్తం చేశారు.
ఎంపీ సుబ్రహ్మణ్యస్వామి ఇచ్చే సర్టిఫికెట్ తమకు అవసరం లేదని భానుప్రకాశ్‌రెడ్డి అన్నారు. గత, ప్రస్తుత పాలకమండళ్లు ఏం చేశాయనే దాన్ని తెలుసుకోవాలని హితువు పలికారు. సీఎం జగన్‌ను ప్రశంసించటంపై సుబ్రహ్మణ్యస్వామి హిందూవులకు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
'వేలం కోసం ఎస్టేట్ ఆఫీసర్ తో ప్రొసీడింగ్స్ ఇప్పించి ఇప్పుడు పాలకమండలి సమీక్ష మాత్రమే అని చెప్పడం ఏంటి? హుండీ లో కానుకలు వేయొద్దని చెప్పిన రమణదీక్షితులు ఇప్పుడు శ్రీవారి ఆస్తులపై సలహాలు ఇవ్వడం హాస్యాస్పదం'- భానుప్రకాశ్ రెడ్డి, భాజపా నేత, తితిదే బోర్డు మాజీ సభ్యుడు
ఇదీ చదవండి: