తిరుపతి రుయా కొవిడ్ ఆసుపత్రిలో ప్రాణవాయువు అందక పదకొండు ప్రాణాలు కోల్పోయిన ఘటనపై న్యాయవిచారణ జరిపించాలని భాజపా రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాశ్ రెడ్డి డిమాండ్ చేశారు. తిరుపతి రుయా ఆసుపత్రిలో మృతుల బంధువులను ఆయన పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నామని భానుప్రకాశ్ రెడ్డి అన్నారు. అవసరాలకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోవటంపై చూపించిన అలసత్వమే ఘటనకు కారణమన్నారు. మృతులకు తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాలన్నారు. జరిగిన మొత్తం ఘటనపై కారకులను అన్వేషించేందుకు జ్యుడీషియల్ ఎంక్వైరీ జరిపించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చదవండి: ఆక్సిజన్ ట్యాంకర్ 5 నిమిషాలు ఆలస్యం.. 11 మంది కొవిడ్ రోగులు మరణం