బర్డ్ ఆసుపత్రిలో ఆధునిక వైద్య సేవలు అందించడానికి చర్యలు చేపడుతున్నట్లు బర్డ్ గౌరవ డైరెక్టర్ మదనమోహన్ రెడ్డి తెలిపారు. ఇప్పటికే బర్డ్ ఆసుపత్రిలో మోకీలు, తుంటి ఎముక మార్పిడి శస్త్రచికిత్సలు జరుగుతున్నాయని, అదనంగా వెన్నెముక ఆపరేషన్లు ప్రారంభించినట్లు ఆయన తెలిపారు. చెన్నైకి చెందిన ప్రముఖ వెన్నెముక వైద్యనిపుణులు డాక్టర్ బాలమురగన్ బృందం వెన్నెముక శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.
బోన్ క్యాన్సర్ ఉన్న రోగులకు ఆధునిక వైద్యసేవలు అందుబాటులోకి తీసుకురావడానికి బోన్ బ్యాంక్ ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. కొవిడ్ అనంతరం బర్డ్ ఆసుపత్రిలో పూర్తిస్థాయి వైద్యసేవలు అందుబాటులోకి వచ్చాయన్నారు. రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించడానికి అదనంగా వైద్య సిబ్బందిని నియమిస్తున్నామని.. ఎయిమ్స్ సహకారంతో పీజీలకు శిక్షణ ఇచ్చే లక్ష్యంతో ఎయిమ్స్ తో ఒప్పందం కుదుర్చుకోనున్నట్లు ఆయన తెలిపారు.
ఇదీ చదవండి: చిత్తూరు జిల్లా పరిశీలకుడి మార్పు