ETV Bharat / city

'గవర్నర్​ గారూ.. వైద్య కళాశాల ప్రారంభానికి రండి' - తిరుపతిలో బాలాజీ మెడికల్ కళాశాల

భువనేశ్వర్​కు చెందిన హైటెక్ గ్రూప్ ప్రతినిధులు... రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్​ను రాజ్​భవన్​లో కలిశారు. తిరుపతి పట్టణంలో ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని కోరారు.

bhuvaneshwar high tech representatives
bhuvaneshwar high tech representatives
author img

By

Published : Nov 17, 2020, 10:20 PM IST

తిరుపతి పట్టణంలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేసిన వైద్య కళాశాల ప్రారంభోత్సవానికి హాజరుకావాలని భువనేశ్వర్​కు చెందిన హైటెక్ గ్రూప్ ప్రతినిధులు... రాష్ట్ర గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్​ను కోరారు. రాజ్​భవన్ దర్బార్ హాలులో గవర్నర్​తో సమావేశమయ్యారు.

హైటెక్ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ తిరుపతి ప్రాణీగ్రాహీ... తిరుపతి పట్ణణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బాలాజీ మెడికల్ కళాశాల గురించి వివరించారు. అత్యాధునిక సౌకర్యాలతో ఆధునిక వసతులతో ఏర్పాటు చేసిన ఆసుపత్రి, మెడికల్ కళాశాలలను ప్రారంభించేందుకు ముఖ్య అతిథిగా విచ్చేయాలని ఈ సందర్భంగా కోరారు. దీనిపై సానుకూలంగా స్పందించిన గవర్నర్... తప్పక పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.

ఇదీ చదవండి:

ఉద్యోగాల పేరుతో మోసం.. ముగ్గురు సీఐఎస్​ఎఫ్​ కానిస్టేబుళ్లు అరెస్ట్

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.