చిత్తూరు జిల్లా మదనపల్లిలో బాహుదా కాలువ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. కర్ణాటక రాష్ట్రం నుంచి వరద ఎక్కువగా రావడంతో బాహుదా కాలువలో నీటి ఉద్ధృతి పెరిగింది.
దీనితో పాటుగా పట్టణానికి ఎగువన ఉన్న చెరువుల నుంచి కూడా వరద నీరు ఎక్కువగా వస్తోంది. దీంతో ఆర్టీసీ బస్టాండ్ కి వెళ్లే మార్గంలో రాకపోకలు స్తంభించాయి దిగువ ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు చేరింది. నీటి ఉద్ధృతి ఎక్కువ కావడంతో లోతట్టు ప్రాంతాల ప్రజలను అధికారులు అప్రమత్తం చేశారు. నీటి ఉద్ధృతి పెరిగితే వారిని అక్కడి నుంచి తరలిస్తామని పురపాలక సంఘం అధికారులు తెలిపారు.
ఇది చదవండి : 'కేసులు నాకేం కొత్త కాదు... లోపల వేసినా మళ్లీ బయటకు వస్తా'