తిరుపతిలోని ఏస్వీ ఆటోనగర్ సొసైటీ ఆధీనంలో ఉన్న స్ధలాన్ని ఆక్రమించిన కబ్జాదారులను అరెస్టు చేయాలని ఆటో కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేరకు సబ్ కలెక్టరేట్ ఎదుట ఆందోళనకు దిగారు. అక్రమ కట్టడాలను తొలగించి కార్మికులకే ఆ స్థలాన్ని కేటాయించాలని రోడ్డుపై బైఠాయించి నినాదాలు చేశారు. కార్మికుల శ్రేయస్సు కోసం కమ్యునిటీ హాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.
ఇదీ చూడండి: పదోతరగతి పరీక్షల షెడ్యూల్ విడుదల