హైదరాబాద్‌లో తెలంగాణాకు చెందిన అమర జవాన్ మహేశ్, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాలను ఒకే విమానంలో తరలించారు. మహేష్ పార్థివదేహాన్ని బేగంపేట విమానాశ్రయంలో కుటుంబ సభ్యులకు అప్పగించిన అనంతరం అదే విమానంలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహాన్ని రేణిగుంటకు తరలించనున్నారు. రేణిగుంటలో ప్రవీణ్ కుమార్ రెడ్డి పార్థివదేహానికి విమానయాన శాఖ, రాష్ట్ర ప్రభుత్వ అధికారులు నివాళులర్పించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. రాత్రి వరకు ప్రవీణ్ కుమార్ రెడ్డి సొంతూరుకు ఆయన భౌతికకాయం తీసుకెళ్లనున్నారు.
ఇదీ చదవండి: జర్నలిస్ట్ నుంచి ప్లీడర్ దాకా.. కార్యకర్త నుంచి ఎమ్మెల్యే వరకు రఘునందనమే