విశాఖ- చెన్నై పారిశ్రామిక కారిడార్ లో భాగంగా... చిత్తూరు జిల్లాలో భూ సేకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఏపీఐఐసీ డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయంలో జిల్లా కలెక్టర్ భరత్ గుప్తా, ఉన్నతాధికారులతో సమావేశమైన ఆయన... భూసేకరణ ప్రక్రియ జరుగుతున్న తీరుపై సమీక్షించారు. కొవిడ్ కారణంగా పనులు ఆలస్యం అయ్యాయని వివరించిన కలెక్టర్... భూసేకరణ ప్రక్రియ పూర్తి చేస్తామన్నారు. పారిశ్రామిక నడవా ఏర్పాటైతే కలిగే లాభాలను స్థానిక ప్రజలకు అర్థమయ్యేలా వివరించడం ద్వారా...ప్రక్రియను వేగవంతం చేయాలని డైరెక్టర్ సుబ్రహ్మణ్యం సూచించారు.
ఇదీ చదవండి