అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో రూ. 91 వేల కోట్లు.. సంక్షేమ కార్యక్రమాలకు సీఎం జగన్ వెచ్చించారని తిరుపతి శాసనసభ్యుడు భూమన కరుణాకరరెడ్డి అన్నారు. తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలో అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వం తరపున ఇళ్ల స్థలాల పట్టాలను అందించే కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. తిరుపతి ఎంపీ గురుమూర్తి, నగరపాలక సంస్థ మేయర్ శిరీష, నగర పాలక సంస్థ కమిషనర్ పీఎస్ గిరీషా తదితరులు కార్యక్రమానికి హాజరయ్యారు.
ఏర్పేడు మండలం వికృతమాలలో నిర్మించిన గృహ సముదాయంలో తిరుపతిలోని అర్హులైన లబ్ధిదారులకు ఇళ్లను కేటాయిస్తూ.. పత్రాలను, ఇంటి తాళాలను అందించారు. ఓటు తమ పార్టీకి వేశారా లేదనేది పట్టించుకోకుండా సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్తున్నామని భూమన కరుణాకరరెడ్డి అన్నారు.
ఇదీ చదవండి:
రేపు రాష్ట్ర బడ్జెట్.. పిల్లలు, మహిళలకు ప్రత్యేక కేటాయింపులు