ETV Bharat / city

Amaravathi Mahodyama Sabha: తిరుపతిలో 'సమరావతి సభ'..తరలివస్తున్న జనం

Amaravathi Farmers Sabha: అమరావతి అందరిదీ అనే నినాదంతో.. రాజధాని ప్రాంతం వెలుపల తొలిసారి భారీ బహిరంగ సభ నిర్వహణకు రైతులు సిద్ధమయ్యారు. తిరుపతి వేదికగా జరగనున్న 'అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ'కు ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. భావి తరాల భవిష్యత్తు, మన బిడ్డల బాగు కోసం అమరావతి నిర్మాణం అవసరమనే సందేశాన్ని సభ ద్వారా చాటనున్నారు. వైకాపా మినహా అన్ని రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు హాజరు కానున్నారు.

Amaravathi Mahodyama Sabha
అంతా అమరావతి సభకే...
author img

By

Published : Dec 17, 2021, 10:08 AM IST

Updated : Dec 17, 2021, 1:15 PM IST

తిరుపతిలో అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ జరగనుంది. 'అమరావతి అందరిది' పేరుతో జరుగుతున్న రైతుల భారీ బహిరంగ సభకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల నుంచి ప్రజలు భారీగా తరలి వస్తున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సాయంత్రం 6 వరకు సభ సాగనుంది. మహాపాదయాత్ర ముగింపుగా నేడు తిరుపతిలో ఈ బహిరంగ సభను ఏర్పాటు చేశారు.

తరలివచ్చిన రైతులు

తిరుపతి సభకు అమరావతి నుంచి పెద్దఎత్తున రైతులు తరలివచ్చారు. ఇప్పటికే పాదయాత్ర చేస్తున్న రైతులు తిరుపతిలోనే ఉన్నారు. వారి కుటుంబసభ్యులు కూడా గత రెండు, మూడు రోజుల నుంచి తిరుపతికి చేరుకుంటున్నారు. ప్రత్యేక బస్సుల్లో 29గ్రామాల ప్రజలు భారీగా తరలివచ్చారు. రైతులకు మద్దతుగా సభాస్థలికి రాజధాని గ్రామాల నుంచి, ఇతర ప్రాంతాల ప్రజలు తరలివస్తున్నారు. తిరుపతి సభను జయప్రదం చేసేందుకు రైతులు సిద్ధంగా ఉన్నారు.

అన్ని దారులు అటువైపే..

అమరావతి పరిరక్షణ సభకు వైకాపా మినహా అన్ని పార్టీలకు ఆహ్వానం అందింది. నేడు తిరుమల, తిరపతిలో పర్యటన, శ్రీవారి దర్శనం అనంతరం తెదేపా అధినేత చంద్రబాబు బహిరంగ సభకు హాజరుకానున్నారు. కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలోని భాజపా బృందం అమరావతి సభకు తిరుపతికి బయలు దేరింది. కాంగ్రెస్‌, జనసేన, వామపక్ష పార్టీల నేతలు కూడా మహోద్యమ సభకు హాజరుకానున్నారు.

రైతుల సభకు తరలివచ్చిన న్యాయవాదులు

Lawyers Attended Tirupathi Farmers Sabha:తిరుపతి రైతుల సభకు న్యాయవాదులు తరలివచ్చారు. సభకు ఎందరు రావాలనే నిబంధన ఎక్కడా లేదని లాయర్‌ లక్ష్మీనారాయణ తెలిపారు. సభకు వచ్చేవారిని పోలీసులు అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. ఆంక్షల పేరుతో అడ్డుకుంటే కోర్టు ఉల్లంఘన కిందకు వస్తుందని తెలిపారు. సభకు వచ్చేవారిని గృహనిర్బంధం చేయడంపై కోర్టు దృష్టికి తెస్తామన్నారు. కోర్టు నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే పోలీసులు శిక్షార్హులని న్యాయవాది వివరించారు.

తిరుపతి రైతుల మహా సభపై పోలీసుల ఆంక్షలు

Police Restrictions to Amaravathi Sabha: తిరుపతి రైతుల మహా సభపై పోలీసుల ఆంక్షలు మొదలయ్యాయి. తెదేపా నేతలే లక్ష్యంగా పోలీసుల ఆంక్షలు కొనసాగుతున్నాయి. ఈ రోజు ఉదయం నుంచి తెలుగుదేశం నేతలు తిరుపతి రాకుండా పోలీసులు పలుచోట్ల అడ్డుకుంటున్నారు. చింతమనేని ప్రభాకర్ తో పాటు చిత్తూరు జిల్లాలో పలువురు తెదేపా నేతలను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన రైతులు,సభకు మద్దతు రాకుండా ప్రభుత్వం అడ్డుకునే కుట్ర చేస్తోందని మండిపడ్డారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా సభను విజయవంతం చేసి తీరుతామని జేఏసి నేతలు స్పష్టంచేశారు.

అమరావతి రైతుల మహాసభకు జోరుగా ఏర్పాటు.

Active Arrangements for Amaravathi Sabha : తిరుపతిలో చేపట్టిన అమరావతి రైతుల మహాసభకు జోరుగా ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. చిత్తూరు జిల్లానుంచే కాకుండా రాష్ట్రంలోని అధిక సంఖ్యలో రైతులు వివిధ పార్టీలకు చెందిన నేతలు హాజరు కానున్నారు. పూతలపట్టు- నాయుడుపేట ప్రధాన రహదారిపై స్వాగత ఫ్లెక్సీలు, మామిడాకుల తోరణాలు, అరటి మొక్కలతో సుందరంగా తీర్చిదిద్దుతున్నారు. మధ్యాహ్నం ఒంటి గంట నుంచి సభ ప్రారంభం కానుండటంతో వడివడిగా సభా ప్రాంగణానికి చేరుకుంటున్నారు.

ఇదీ చదవండి : MAHODYAMA SABHA: నేడే మహోద్యమ సభ.. హాజరుకానున్న చంద్రబాబు

Last Updated : Dec 17, 2021, 1:15 PM IST

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.