Vishwak Sen new movie details: తిరుమల శ్రీవారిని 'ఓరి దేవుడా' చిత్ర బృందం దర్శించుకుంది. ఈ రోజు మధ్యాహ్నం కాలినడక మార్గం ద్వారా నటుడు విశ్వక్ సేన్, హీరోయిన్ మిథిలా, చిత్ర యూనిట్ తిరుమలకు చేరుకున్నారు. అనంతరం 300 రూపాయల ప్రత్యేక దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. దర్శనానంతరం ఆలయం వెలుపల నటుడు విశ్వక్ సేన్ మాట్లాడారు.
తన సినిమా విడుదలకు ముందు స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ అన్నారు. ఈ 21న 'ఓరి దేవుడా' చిత్రం ప్రేక్షకులకు ముందు రాబోతుందని తెలిపారు. కుటుంబ కథ చిత్రంగా తెరకెక్కిందని ఆయన వెల్లడించారు. ప్రతి ఒక్కరూ సినిమాను తప్పక చూడాలని విజ్ఞప్తి చేశారు.
ఇవీ చదవండి: