నకిలీ పాన్ కార్డులను తయారు చేస్తున్న వ్యక్తిని తిరుపతిలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. నగరంలోని కౌశికా ఇంటర్నెట్ సెంటర్ యజమాని అయిన నిందితుడు.. నకిలీ పాన్ కార్డులను స్పష్టించి తద్వారా ప్రభుత్వ పథకాలను పొందేందుకు వీలుగా ఆధార్ కార్డుల్లో వయసు మార్చుతున్నట్లు గుర్తించారు.
ఆధార్ కార్డుల్లో వయసు హెచ్చుతగ్గులు చేస్తున్నట్లు సమాచారం రావటంతో విజిలెన్స్ ఎస్పీ రమేశయ్య ఆదేశాలతో విజిలెన్స్ డీఎస్పీ మల్లేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బంది తిరుపతి-కరకంబాడి రోడ్డులోని కౌశికా ఇంటర్నెట్ సెంటర్లో ఆదివారం దాడులు నిర్వహించారు. నిందితుడే స్వయంగా స్టాంప్, సీల్ తయారు చేసుకుని గెజిటెడ్ సంతకం చేస్తున్నట్లు గుర్తించారు. అర్హత లేనివారికి ప్రభుత్వ పథకాలు పొందడానికి సహకరించినందుకు అతన్ని అదుపులోకి తీసుకున్న అధికారులు... పోలీసులకు అప్పగించారు. ఎంతమంది ఆధార్ కార్డుల్లో మార్పులు చేశాడో తెలియాల్సి ఉంది.
ఇదీ చదవండి