గోదావరి నది పూర్తిగా కాలుష్యమయంగా మారిందని వాటర్ మాన్ ఆఫ్ ఇండియా రాజేంద్రసింగ్ ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పరిణామం జీవ మనుగడకు హానికరమని అన్నారు. గోదావరి పరిరక్షణలో భాగంగా తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో.. తన బృందంతో కలిసి రాజేంద్రసింగ్ పర్యటించారు. నన్నయ వర్శిటీని సందర్శించి విద్యార్థులకు పలు అంశాలపై సూచనలు ఇచ్చారు. గోదావరిని రక్షించడంలో తమ వంతు బాధ్యత వహిస్తానని ఆదికవి నన్నయ వర్శిటీ వీసీ ఆచార్య మక్కా జగన్నాథ రావు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: