అమరావతిలోనే రాజధానిని కొనసాగించాలని.. అమరావతి పరిరక్షణ సమితి చేస్తున్న ఉద్యమానికి మద్దతుగా ఐకాస నాయకులతో కలిసి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు.. నేడు రాజమహేంద్రవరంలో పర్యటించనున్నారు. అమరావతి రైతుల పోరాటాన్ని ప్రజలకు వివరించే ప్రయత్నం చేయనున్నారు. అయితే చంద్రబాబు సభకు పోలీసులు అనుమతి ఇవ్వలేదు. కోటిపల్లి బస్టాండ్, మోరంపూడి జంక్షన్, శుభమస్తు కల్యాణ మండపం ఎదురుగా ఉన్న ఖాళీ ప్రదేశాల్లో.. ఏదో ఒక చోట అనుమతి ఇవ్వాలని తెదేపా నాయకులు పోలీసులను కోరారు. ఇప్పటివరకూ పోలీసులు అనుమతి ఇవ్వలేదు. పోలీసులు స్పందించకపోవడంపై తెదేపా నాయకులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.
ఇదీ చదవండి: