ETV Bharat / city

ఘనంగా రాఖీ సంబరాలు... ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టిన మహిళలు

అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమాభిమానాలకు ప్రతీక రాఖీ పండుగ. సహోదరులు రాఖీ కడితే తన సోదరుడు జీవితాంతం రక్షణగా ఉంటాడని ఒక నమ్మకం. నేడు రాఖీ పౌర్ణమి కావటంతో రాష్ట్ర వ్యాప్తంగా పిల్లలు, పెద్దలు ఆనందంగా వేడుక జరుపుకున్నారు. ప్రజా ప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టి తమ ఆప్యాయతను వ్యక్తపరిచారు.

rakhi pornami
ఘనంగా రాఖీ సంబరాలు... ప్రజాప్రతినిధులకు రాఖీలు కట్టిన మహిళలు.
author img

By

Published : Aug 3, 2020, 5:02 PM IST

రాష్ట్రవ్యాప్తంగా రాఖీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. శ్రావణ పౌర్ణమి కావటంతో ప్రతి ఇంటా సోదరసోదరీమణులు ఆనందంగా రక్షా బంధన్ పండుగను నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో ప్రజా ప్రతినిధులకు మహిళలు రాఖీలు కట్టి శుభాకాంక్షలు తెలిపారు.

విశాఖ నగరంలో ఏవీఎన్ కళాశాల ఎదురుగా ఉన్న ప్రేమ సమాజం లెప్రసీ సేవా కేంద్రంలో రక్షాబంధన్ వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్రంలో ఆశ్రయం పొందుతున్న వారందరికీ వివేకానంద సంస్థ మహిళా సభ్యులందరూ రాఖీలు కట్టి మిఠాయిలు తినిపించి.. వారి ఆశీస్సులు పొందారు.

తూర్పు గోదావరి జిల్లా పి, గన్నవరంలో సోదరీమణులు సోదరులకు రాఖీలు కట్టి ఆశీర్వచనాలు తీసుకున్నారు. పి. గన్నవరం ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబుకు ఆయన సోదరి నాగ వరలక్ష్మి రాఖీ కట్టారు.

పశ్చిమగోదావరి జిల్లా తణుకులో రాష్ట్ర చేనేత కార్పొరేషన్ మాజీ చైర్మన్ వావిలాల సరళాదేవి తన స్వగృహంలో రాఖీ వేడుకలను నిర్వహించారు. అన్నాచెల్లెళ్ల మధ్య ప్రేమాభిమానాలకు రాఖీ పండుగ ప్రతీక అని అన్నారు. చెల్లెళ్లు అన్నలకు రాఖీలు కడితే, అన్నలు వారికి రక్షణగా ఉంటారనేది రాఖీ పరమార్థమని పేర్కొన్నారు.

ఇదీ చదవండి కరోనా పాజిటివ్​ వ్యక్తి అత్మహత్య

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.