ఆంధ్రప్రదేశ్‌ను ప్రత్యేక రాష్ట్రంగా చూడాలని..బడ్జెట్లో మరిన్ని కేటాయింపులు చేయాల్సిన అవసరం ఉందని రాజమేంద్రవరం ఎంపీ మార్గాని భరత్ అభిప్రాయపడ్డారు. విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాష్ట్రానికి నిధులు కేటాయించాలని అన్నారు. ఏపీని ప్రత్యేక దృష్టితో చూడాల్సిన అవసరం ఉందని...రాష్ట్ర హక్కుల కోసం పార్లమెంట్లో పోరాడే విధంగా కార్యాచరణ ఉండబోతుందని అన్నారు. సోమవారం నుంచి పద్దులపై చర్చ జరగనున్న నేపథ్యంలో.. వైకాపా రాజ్యసభ, లోక్‌సభ సభ్యులందరమూ కలిసి చర్చించి ఓ నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
ఇదీ చదవండి:'మోదీ పరువు నష్టం' కేసులో రాహుల్‌కు బెయిల్