ETV Bharat / city

రెండు చోట్ల లీకైన ఓఎన్జీసీ గ్యాస్ పైపులైను - two places

తూర్పు గోదావరి జిల్లాలో రెండు చోట్ల ఓఎన్​జీసీ పైపులైను లీకైంది. వాటిని చూసి ప్రజలు భయభ్రాంతులకు గురయ్యారు. సత్వరమే అధికారులు స్పందించినందున ఎలాంటి ప్రమాదం జరగలేదు.

పైపు లైను
author img

By

Published : Jun 25, 2019, 6:00 AM IST

రెండు చోట్ల లీకైన ఓఎన్జీసీ గ్యాస్ పైపులైను

తూర్పుగోదావరి జిల్లా సఖినేటిపల్లి మండలంలో కేశవదాసుపాలెంలో ఓఎన్​జీసీ పైపులైను సోమవారం ఉదయం రెండు చోట్ల లీకైంది. పైపులైన్ నుంచి సహజవాయువు ఎగిసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. కేసవదాసుపాలెంలోని బెల్లంకొండ గ్రూప్‌ పరిసర ప్రాంతాల్లోని పొలాల్లో గ్యాస్‌ లీకవటం స్థానికులు గమనించారు. మోరీ జీసీఎస్ పాయింట్‌ పైప్‌లైన్‌లోనూ లీకేజీ జరిగింది. విషయం తెలుసుకున్న జీసీఎస్ అధికారులు, పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని లీకేజీలను నియంత్రించారు. పాత పైపులైన్లను డమ్మీ చేసి కొత్తగా 12 పైపు లైన్లు వేశామని, డమ్మీ చేసిన చోట చిల్లు పడినందున గ్యాస్ పాత పైపులైన్​లోకి వచ్చి వాటికి ముందున్న లీకుల్లో కొద్దిగా బయటకు వచ్చిందని ఓఎన్​జీసీ అధికారులు తెలిపారు. దీని వల్ల ప్రమాదమేమి లేదని అన్నారు. అయితే లీకేజీల వల్ల పంటలు దెబ్బతింటున్నాయని... సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని రైతులు డిమాండ్ చేశారు.

New Delhi, Jun 24, ANI: American singer-songwriter Madonna has topped the Billboard 200 chart with her ninth No. 1 album 'Madame X'. According to The Hollywood Reporter, the pop album, which was released on June 14 by Interscope Records, sold approximately 95,000 sets. Following Barbra Streisand, Madonna has the second-most No. 1 albums among female singers. Streisand has bagged the title 11 times. In the overall category, The Beatles have the most No. 1s, with 19 albums. Other than Madonna, Ariana Grande's former No. 1 'Thank U, Next' and Lizzo's 'Cuz I Love You' climbed among the top 20 list. The Billboard 200 chart ranks the most popular albums from the US on a multi-metric consumption basis.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.