తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరం నగరంలో... ఉభయగోదావరి జిల్లాల వాటర్ గ్రిడ్ ప్రాజెక్టుపై ఆరుగురు మంత్రులు సమీక్ష నిర్వహించారు. ఉభయగోదావరి జిల్లాలకు రక్షిత తాగునీటి కోసం రూ.8,500 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకం ప్రారంభిస్తున్నట్లు మంత్రి పిల్లి సుభాష్ చంద్రబోస్ తెలిపారు. రెండు జిల్లాల ప్రజలకు రక్షిత నీరు అందించాలన్నదే సీఎం సంకల్పమని వివరించారు. వరద బాధితులను అన్ని విధాలా ఆదుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఇదీ చదవండీ... పల్నాడులో టెన్షన్..144 సెక్షన్ విధింపు