3 రాజధానులు ఏర్పాటుచేసి తీరతామని.. ఆ ప్రక్రియలోనే ఉన్నామని మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర సమగ్రాభివృద్ధి కోసమే 3 రాజధానుల నిర్ణయమని పేర్కొన్నారు. మిగిలిన 32 పురపాలికలు, 3 నగరపాలికలకు త్వరలోనే ఎన్నికలు జరుగుతాయని తెలిపారు. విలీన గ్రామాలను కలిపి రాజమహేంద్రవరం నగరపాలికకు ఎన్నికలు జరుగుతాయని మంత్రి వెల్లడించారు. రాజమహేంద్రవరంను మోడల్ నగరంగా తీర్చిదిద్దుతామని హామీ ఇచ్చారు.
ఇదీ చదవండి: సోమవారం నామినేషన్ దాఖలు చేస్తా: రత్నప్రభ