ETV Bharat / city

తవ్వుకున్నోడికి తవ్వుకున్నంత.. కాసులు కురిపిస్తున్న నల్లరాతి క్వారీలు.. - తూర్పుగోదావరి జిల్లాలో అక్రమంగా నల్లరాతి క్వారీల్లో తవ్వకాలు

Illegal excavations: తూర్పుగోదావరి జిల్లాలో నల్లరాతి క్వారీలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యం అక్రమార్కుల పాలిట వరంగా మారింది. అనుమతులు, నిబంధనలతో సంబంధం లేకుండా కొందరు ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. యధేచ్చగా తవ్వకాలు జరిపి రవాణా చేసి సొమ్ము చేసుకుంటున్నారు. అడిగేవారెవరు..?... ఆపేవారెవరు అన్నట్లుగా అక్రమ తవ్వకాలు సాగిస్తున్నారు.

Illegal excavations
అక్రమ తవ్వకాలు
author img

By

Published : May 18, 2022, 9:31 AM IST

నల్లరాతి క్వారీలు అక్రమార్కులకు కాసులు కురిపిస్తున్నాయి. అనుమతులు, నిబంధనలతో సంబంధం లేకుండా కొందరు ఇష్టారాజ్యంగా తరలించేస్తున్నారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు, దేవరపల్లి, ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల పరిధిలో నల్లరాతి క్వారీలు ఉన్నాయి. వీటిలో పర్యావరణ అనుమతులు లేని వాటిలో తవ్వకాలను నిలిపివేయాలని ఏప్రిల్‌ 2020లో కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో జిల్లాలోని నల్లరాతి క్వారీల తవ్వకాలకు అనుమతులు నిలిపివేశారు. వంద వరకు క్వారీలుండగా 24కు మాత్రమే పర్యావరణ అనుమతులున్నాయని అధికారులు చెబుతున్నారు. మిగిలినవారు దరఖాస్తు చేసుకున్నా.. ఇంకా అనుమతులు రానప్పటికీ తవ్వకాలు ఆగడం లేదు.

ప్రభుత్వాదాయానికి గండి: దేవరపల్లి, కొవ్వూరు, ద్వారకాతిరుమల మండలాల్లోని క్వారీల నుంచి అక్రమంగా నల్లరాయిని క్రషర్లకు తరలించి రోజూ సుమారు వెయ్యి లారీల మెటల్‌(చిప్స్‌) ఇతర ప్రాంతాలకు పంపిస్తున్నారు. నిబంధనల ప్రకారం.. సీనరేజీ ఒక్కో లారీకి రూ.1400 చొప్పున లెక్కిస్తే మూడేళ్లలో రూ.15.12 కోట్ల వరకు ప్రభుత్వ ఆదాయానికి గండి పడింది. సున్నపురాయి, సుద్దరాతి గనుల నుంచి రావాల్సి సీనరేజీని పరిగణనలోకి తీసుకుంటే భారీగానే ఉంటుంది.

అధికారులు ఏం చేస్తున్నట్లు..?: గనులశాఖలో అవినీతికి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేక విజిలెన్స్‌ విభాగం ఉంది. వీరు క్వారీల్లో తనిఖీలు చేసి నిబంధనలకు విరుద్ధంగా తవ్వకాలు చేపడుతున్న వారిపై కేసులు నమోదు చేసి జరిమానా విధించాలి. కానీ అరకొరగా తప్ప పూర్తిస్థాయి పర్యవేక్షణ కొరవడింది. మూడొంతుల వరకు అనధికారిక తవ్వకాలే కావడంతో సీనరేజీ ఊసే లేదు. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దీనిపై గనులశాఖ(ఏలూరు) ఏడీ సుబ్రహ్మణ్యం వద్ద ప్రస్తావించగా.. నల్లరాతి గనుల్లో తవ్వకాలు, తరలింపునకు మూడేళ్ల నుంచి పర్యావరణ అనుమతులు ఇవ్వడం లేదన్నారు. కొందరు అక్రమంగా తవ్వకాలు సాగిస్తున్న విషయం తమ దృష్టికి వచ్చిందని తెలిపారు. వెంటనే పరిశీలించి నిబంధనలకు విరుద్ధంగా ఉంటే చర్యలు తీసుకుంటామన్నారు. అధికారులపై వస్తున్న ఫిర్యాదులపైనా విచారణ జరిపిస్తామన్నారు.

ఇవీ చదవండి:

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.