గోదావరిలో వరద ఉద్ధృతి..మళ్లీ పెరుగుతోంది. ధవళేశ్వరం వద్ద మరోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద 11 అడుగులకు మించి వరద ప్రవహిస్తోంది. 10 లక్షల క్యూసెక్కులపైగా నీటికి దిగువకు విడుదల చేస్తున్నారు. అటు.. ఉభయగోదావరి జిల్లాల్లోని లంక గ్రామాల ప్రజల కష్టాలు కొనసాగుతున్నాయి. కనకాయలంక ప్రజలు వారం రోజులుగా వరద నీటిలోనే ఇక్కట్లు పడుతున్నారు. చాకలిపాలెం సమీపంలో వశిష్ఠ గోదావరి నది పాయ ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. వారంరోజులుగా ఇక్కడి కాజ్‌వే ముంపు నీటిలోనే ఉంది. ఫలితంగా రాకపోకలు నిలిచిపోయాయి.
ఇవి కూడా చదవండి: