వందేమాతర ఉద్యమం ప్రారంభంలో... బిపిన్ చంద్రపాల్ దేశ పర్యటనలో భాగంగా 1907లో రాజమహేంద్రవరం తొలిసారి వచ్చారు. అప్పట్లో ఆయన ప్రసంగించిన ప్రాంతాన్ని పాల్‌చౌక్‌గా పిలిచేవారు. తరువాతి రోజుల్లో మహాత్మాగాంధీ, జవహర్‌లాల్ నెహ్రూ, టంగుటూరి ప్రకాశం పంతులు వంటి నేతలు ప్రసంగించారు. చారిత్రక విశిష్టత ఉన్న ఈ ప్రదేశంలో... ఆంధ్రకేసరి యువజన సమితి వ్యవస్థాపకుడు వైఎస్ నరసింహారావు... స్వాతంత్ర్య సమరయోధుల పార్క్ నిర్మించారు. ఉద్యమంలో పాల్గొని జైలు జీవితం అనుభవించిన 12 మంది మహిళలతోపాటు... మహాత్మాగాంధీ, టంగుటూరి ప్రకాశం పంతులు, గరిమెళ్ల సత్యనారాయణ, చిలకమర్తి లక్ష్మీనరసింహం విగ్రహాలు నెలకొల్పారు.
స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొన్న సమరయోధుల చరిత్ర, వారు రచించిన గ్రంథాలను సేకరించి పార్క్ ప్రాంగణంలో గ్రంథాలయం ఏర్పాటు చేశారు. జాతీయ కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు నుంచి చివరి తరం నాయకుల చిత్ర పటాలు ఇక్కడ ఏర్పాటు చేశారు. మహాత్ముడి జీవితంలోని ముఖ్య ఘటనలకు సంబంధించిన పుస్తకాలు, టంగుటూరి, చిలకమర్తి లక్ష్మీనరసింహం, న్యాపతి సుబ్బారావు పంతులు, దుర్గాభాయ్ దేశ్ ముఖ్ వంటి నాయకుల చరిత్రలు ఇక్కడ అందుబాటులో ఉంచారు.
స్వాతంత్య్ర సమరయోధులకు సంబంధించి భారతీయ భాషల్లో ప్రచురితమైన పుస్తకాలు లైబ్రరీలో ఉన్నాయని, పరిశోధనలకు ఇవి ఉపయోగపడతాయని నిర్వాహకుడు తెలిపారు.
ఇదీ చదవండి: